Gulf Andhra Radio

Total Pageviews

Popular Posts

Friday, February 1, 2013

మన బ్రతుకిక "ఆధార్ " యేనా ?

మొన్న రేషన్ కార్డు నిన్న గుర్తింపు కార్డు నేడు ఆధార్  కార్డు అంటుంది మన సర్కార్ మరి రేపేమిటొ? ప్రజల బ్రతుకిక త్రిశంకు స్వర్గామేనా ? ఏ దేశమేగినా ఎందుకాల్లిడిన పొగడరా  నీ తల్లి భూమి భారతిని అని అన్నాడు రాయప్రోలు  ఆనాడు ,  ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా ప్రజలకు కస్టాలు తప్పవు అంటున్నాయి మన ప్రభుత్వాలు .ఈనాడు . రేషన్ కార్డు లేకుంటే గుప్పెడు మెతుకులు కూడా దొరకవు అనే స్థాయి నుండి ఆధార్  కార్డు లేకుంటే వండుకోవడానికి గ్యాస్ కూడా కష్టం  అనే స్థాయి కి పెరిగాయి ప్రజల తిప్పలు .

      ఇది ఏంటి  అనుకుంటున్నారా? అవునండి మీ ఆధార్  కార్డు ,ఒక బ్యాంకు ఎకౌంటు లేకపోతే ఇక నుండి మీకు సబ్సిడీ పై గ్యాస్ కూడా రాదు. మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ఇది . మనకు వచ్చే గ్యాస్ సిలిండర్ కు మనం చెల్లించే ధర 470 రూపాయలు కాని చమురు కంపెనీలు అమ్మే ధర మాత్రం 1030 రూపాయలు అంటే మిగిలిన 560 రూపాయలను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నమాట . ఇంత వరకు కూడా ఇదే పద్ధతి కొనసాగింది ,
ఇకపై కూడా ఇదే పద్ధతి కొనసాగినా కొంచెం తిరకాసు ఉంది అది ఏంటి అంటే సిలిండర్ తీసుకునే సమయం లోనే మీరు పూర్తి ధర అంటే 1030 రూపాయలను చెల్లించాలి , దానిపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 560 రూపాయలూ మీకు తరువాత ఆధార్ సంఖ్య ఆధారంగా తెరువబడిన బ్యాంకు ఖాతాలో జమ చేయబడతాయి దీనికి పెద్ద తతంగమే ఉన్నది . దీనికోసం మీరు ముందుగా మీ గ్యాస్ డీలర్ దగ్గర మీ ఆధార్  సంఖ్యను మీ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలి దీనికి ఈ నెల 15 తుది గడువు . ఇలా నమోదు చేసిన తరువాత మీరు గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు 1030 చెల్లిస్తే 1 నెల తరువాత మీ సబ్సిడీ మొత్తం 560 రూపాయలు మీకు బ్యాంకు ద్వారా అందుతాయి. దీని వెనుక చాల విషయం ఉన్నది  అది ఏంటి అంటే ఒక నెల పాటు  ఈ మొత్తాన్ని చమురు కంపెనీలు తమ వద్ద ఉంచుకోవడం ద్వారా వాటిని పెట్టుబడులుగా  మలచుకొని వాటి ద్వారా కూడా లాభాన్ని ఆర్జించ వచ్చును అనేది చమురు సంస్థల ఆలోచనగా ఉంది .దీని వల్ల సామన్యునికి ఎటువంటి లాభం లేక పొగా చమురు సంస్థలు లాభాపడుతున్నాయి. ఒక ఇంటిలో ఏడాదికి 8 సిలిండర్లను వాడితే దానిపైన ప్రభుత్వం చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తం 570 కోట్లు ఇదే మొత్తం ఇప్పుడు వారికి పెట్టుబడిగా మారితే ఎంతలాభం ? దీని వలన సామాన్యునికి ఎమన్నా లాభం ఉన్నదా ? చమురు కంపెనీలకు తప్ప 

    ఇక ఈ ఆధార్  కార్డుల విషయానికి వస్తే మన రాష్ట్రం లో 8 కోట్ల మందికి గాను 6 కోట్లమందే  ఈ కార్డులకు నమోదు చేసుకున్నారు ఇంకా 2 కోట్ల మంది నమోదు చేసుకోవాల్సి ఉంది  , నమోదు చేసుకున్న 6 కోట్ల మందిలో 4 కోట్ల మందికే ఆదార్  కార్డులను పంపిణీ   చేసారు ఇంకా 2 కోట్ల మందికి పంపిణీ  చెయ్యాల్సి ఉన్నది మరి వీటిని గ్యాస్ కనెక్షన్ లకు ఇతర ప్రభుత్వ సేవలకు ముడి పెట్టడం ఎంత వరకు సమంజసం ? ఇక దీనిలో ఇంకొక అంశం ఏంటి అంటే వీటికి సంబంధించిన అన్ని విషయాలను ఆన్ లైన్ లోనే చూసుకోవాలి అట మరి మన రాష్ట్రం లోనే 2.5 కోట్ల మందికి అంతర్జాల పరిజ్ఞానం లేదు మరి వారి సంగతేంటి ?
    
    ఇక ఈ కార్డులను భారతదేశం లో ఉన్న వారికి మాత్రం ఇస్తున్నారు  మరి విదేశాల్లో ఉన్న భారతీయుల పరిస్థితి ఏంటి ? రేపు వారు మళ్ళీ  మన దేశానికి తిరిగివచ్చినప్పుడు వారు ప్రభుత్వ సేవలను పొందాలంటే వారికి దిక్కేది ?
   కాబట్టి ఏదో చేసేశాం  అంటూ చేతులు దులుపుకోవడం కాదు ప్రజలకు కష్టాన్ని దూరం చేసి  సులువుగా అందరికి అర్ధమయ్యే రీతిలో ప్రభుత్వ నిర్ణయాలు పధకాలు ఉంటే శ్రేయస్కరం .

               ఉదయ్  ఆకుల 

                 రేడియో జాకీ