Gulf Andhra Radio

Total Pageviews

Popular Posts

Monday, February 14, 2011

నిషా నీడలో నేటి యువత






మాదక ద్రవ్యాలు(డ్రగ్స్) ఈ పేరును ఈ మధ్య మనం తరుచుగా వింటున్నాం.దీనికి అలవాటైన యువత ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు.మాదక ద్రవ్యాలు అవసరమా అనే ప్రశ్న నేటి యువత వేసుకోవాలి. ఏదో సరదాగా కాలక్షేపానికో, స్నేహితుల ప్రోద్భలంతోనో అలవాటైన ఈ మాదక ద్రవ్యాలు వ్యసనంగా మారి ప్రాణాలనే హరించే పరిస్థితి ఎదురవుతుంది.

మాదక ద్రవ్యాలు:-నల్ల మందు, గంజాయి,హెరాయిన్,కోకైన్,చరస్,హశస్,మార్ఫియా మొదలగునవి మాదక ద్రవ్యాలు. ఇవి విపరీత మత్తును కలిగించేవి.
వీటిని వాడటం ద్వారా ఏ ఏ ప్రమాదాలు కలుగుతాయో చూద్దాం

మాదక ద్రవ్యాల వాళ్ళ కలిగే ప్రమాదాలు:-

1. వీటికి అలవాటు పడిన వారు వాటిని వదల లేరు.
2. వారిలో ఇంగిత జ్ఞానం నశిస్తుంది.
3. వాటిపై అధిక ధనాన్ని దుర్వినియోగం చేస్తారు
4. ధనం లేకపోతే దొంగతనం,దోపిడీ,అప్పులు వంటి పనులకు ఒడిగడతారు.
5. ఇవి లభింపకపోతే వారు నిర్వీర్యులగుతారు.
6. వారి ఆరోగ్యం క్షీణిస్తుంది.
7. చట్ట రీత్యా వీటిని వాడటం నేరం.అందువల్ల రహస్యంగా వీటిని పొందటంలో నేరం చేసి అరెస్ట్ అవుతారు.
8. మాదక ద్రవ్యాల జాడ్యం జాడ్యం కలాశాలలలోను, విశ్వ విద్యాలయలలోను కూడా ప్రవేశించి యువతీ యువకులను బానిసలుగా చేస్తుంది .
9. పలు రకాల వ్యాధులు నరాలు చిట్లి పోవడం, మతి భ్రమించడం వంటివి కలిగి మాదక ద్రవ్యాల వినియోగదారులు(బానిసలు) మరణిస్తారు
ఇంతటి అనర్ధాలను కొని తెచ్చే మత్తు పదార్ధాలు మనకు అవసరమా? విచక్షణా జనాన్ని హరించే మాదక ద్రవ్యాలు మనకు అవసరమా? నేర ప్రవృత్తిని పెంచే అవలక్షణం మనకు అవసరమా? సమాధానం మాత్రం అవసరం లేదనే ఉంటుంది. మన అంతరాత్మ చెబుతూనే ఉంటుంది అది తప్పు చెయ్యొద్దని చెబుతున్నా ఎందుకు వినం? మన చేతులారా మన భవిష్యత్తుని మనమే ఎందుకు కాలరాస్తున్నాం? మన తల్లిదండ్రుల ఆశలను అడి ఆశలు చేస్తున్నాం? విజ్ఞతతో ఆలోచిద్దాం వీటికి స్వస్తి చెబుదాం.
భారత దేశం లో ఉన్న యువతలో 64% మంది యువత మత్తు పదార్ధాలకు అలవాటుపడ్డారు.
ఈ మధ్యనే ఒక సంస్థ చేసిన పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే 90% మంది ఇంటర్ విద్యార్ధులు మద్యానికి బానిసలు
అవుతున్నారని. దీనిని బట్టి ఆలోచించండి మన యువత ఎటు వైపు పయనిస్తుందో? ఇంతకూ వీటి వాళ్ళ ఎం
ప్రయోజనం ఉందని ఆలోచిస్తే తేలే విషయం నిష్ప్రయోజనం అని మరి అటువంటి మత్తు పదార్ధాలు మనకు అవసరమా?
సరదాకని మొదలుపెడితే అది మన ప్రాణాల్నే హరిస్తుంది.
వీటిని వాడటం ద్వారా చట్టాన్ని అతిక్రమించినవారంగా జైలు శిక్షను కూడా అనుభవించాల్సి వస్తుంది.
వీటికి చక్కని ఉదాహరణలను మనం ప్రతి రోజూ వార్తా పత్రికలలో చూస్తూనే ఉన్నాం.మనం నిత్యం ఆరాధించే,అనుసరించే సినీ తారలే ఈ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వారిని చూసి ఇంకొందరు ఇలా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా తయారవుతుంది యువత.
మార్కెట్ లో పిప్పర మెంట్ బిళ్ళలు దొరికినట్లుగా ఈ మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి. వీటిని అమ్మే వాళ్ళు లేక పోతే కొనే వాళ్ళు ఉండరు కొనే వాళ్ళు లేక పోతే అమ్మే వాళ్ళు ఉండరు కాబట్టి మన వంతు భాద్యతను నిర్వర్తిద్దాం. వీటిని కొనకుండా ఉందాం. అంతే కాకుండా వీటి సమాచారాన్ని పోలీసులకు అందిద్దాం .
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి , చెడునడతనుండి వారిని తప్పించాలి. చేతులు కాలాకా ఆకులు పట్టుకొని ఏం లాభం? కాబట్టి వారిని ముందునుండే గమనించాలి.
ఈ మత్తులో మునిగి తమ జీవితాలను నాశనం చేసుకున్న వారిని చూసి మనం బుద్ధి తెచ్చుకుందాం.వీలయితే వారిలో మార్పు తీసుకువద్దాం యువతగా ఇది మన బాధ్యత. కాబట్టి మేలుకో యువతా మేలుకో.