Gulf Andhra Radio

Total Pageviews

Popular Posts

Friday, January 28, 2011

నేటి యువత

నేటి యువత పయనం ఎటు వైపు?
సినిమాల వైపా? మాదక ద్రవ్యాలవైపా? ప్రేమ వైపా?
లేక సమాజ సేవ వైపా? ఆలోచిస్తే, ప్రతి ఒక్కరు తమ జీవితాలను పరిశీలిస్తే సమాధానం తెలిసిపోతుంది.
సినిమాలు చూడటం తప్పుకాదు ఆ సినిమాలోని మంచిని తీసుకొని చెడును విసర్జించగలగాలి .
మాదక ద్రవ్యాలు అవసరమా అనే ప్రశ్న నేటి యువత వేసుకోవాలి. ఏదో సరదాగా కాలక్షేపానికో, స్నేహితుల ప్రోద్భలంతోనో అలవాటైన ఈ మాదక ద్రవ్యాలు వ్యసనంగా మారి ప్రాణాలనే హరించే పరిస్థితి ఎదురవుతుంది. మరి అలాంటివి అవసరమా?
ఇక ప్రేమ, ప్రేమించడం తప్పు కాదు మన ప్రేమ ఇంకొకరి ప్రాణాలను తీసే విధంగానో లేక ఇతరుల మనసును నొప్పించేదిగానో ఉండకూడదు.
మనం ప్రేమించినంత మాత్రాన ఎదుటి వారు మనల్ని ప్రేమించాలని ఏమి లేదు కదా. మరి ఈ విషయాన్నీ ఆలోచించకుండా మనం చావడమో లేక ఎదుటి వారిని చంపడమో ఎంతవరకు సమంజసం? ప్రేమించిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవడం తర్వాత తిరిగి తల్లిదండ్రులపై కేసులు పెట్టడం ఎంతవరకు సరి ఐనది?అల చేస్తే కని, పెంచి, విద్యాబుద్ధులు నేర్పించి, మనకంటూ సమాజంలో ఒక గుర్తింపునిచ్చిన వారి హృదయాలు ఎంత క్షోభిస్తాయి? ముదిమి వయసులో మన చేయూతనందుకొని శేష జీవితాన్ని ఆనందంగా గడపాలనుకొనే వారి కల నెరవేరుతుందా? ఆలోచించండి
ఇక సమాజ సేవ విషయానికి వద్దాం. సమాజసేవ అంటే ఏదో దేశాన్ని ఉద్ధరించేయడం కాదు మన వంతుగా ఎదుటి వారి హక్కులను కాలరాయకుండా ఉండటం. మనహక్కులు ఎదుటి వారికి భాద్యతలు అలాగే ఎదుటి వారి హక్కులు మనకు భాద్యతలు.
మనం ఏ విధంగా మన హక్కులను అనుభవించాలి అని అనుకుంటున్నామో ఎదుటి వారు కూడా అలానే ఆలోచిస్తారు.
మరి ఇది సమాజ సేవ కాదంటారా?
ఆలోచించండి, యువత తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే సమ సమాజాన్నిస్థాపించవచ్చు కాబట్టి మేలుకో యువతా మేలుకో.

7 comments:

sashi said...

super suresh..

vedavyas said...

chala bagundi suresh

Radha said...

నేటి యువత నిర్వర్తించవలసిన బాధ్యత గురించి చాలా చక్కగా వివరించారు. యువతని చైతన్యపరచే మరిన్ని రచనలు చెయ్యాలనికోరుతున్నాను. అభినందనలు.

Radha said...

నేటి యువత నిర్వర్తించవలసిన బాధ్యత గురించి చాలా చక్కగా వివరించారు. యువతని చైతన్యపరచే మరిన్ని రచనలు చెయ్యాలనికోరుతున్నాను. అభినందనలు.

Uday said...

ధన్యవాదాలు.
తప్పకుండా చేస్తానండి

satish said...

చాల బాగా చెప్పావ్ సురేష్, నేటి యువత నీ సదేశంతో తప్పక మేలుకుంటుంది అని ఆశిస్తునాను...........

Uday said...

ధన్యవాదాలు సతీష్