Gulf Andhra Radio

Total Pageviews

Popular Posts

Saturday, May 21, 2011

అంతర్జాలపు మాయాజాలం లో నేటి యువత

అంతర్జాలం (ఇంటర్నెట్) ఈ మాట వినని వారు గ్రామాలలో సైతం ఉండరేమో?నేటి మానవుని నిత్యావసరాలలో ఇది కూడా ఒకటిగా మారి పోయింది.ఇది మానవుని జీవితాలను ఎంతగా అల్లుకుపోయింది అంటే ఇది లేకుండా ఏ పని చెయ్యలేని పరిస్థితి. ఈ అంతర్జాలం మానవునికి సౌఖ్యాన్ని ఇచ్చినా దానితో పాటే కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా యువత దీనికోసం తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటుంది.అతి సర్వత్రా వర్జేయత్ అని మన పెద్దలు అంటారు, అది దీనికి కూడా వర్తిస్తుంది.ఈ అంతర్జాలాన్ని ఏ వయసువారు ఎక్కువగా ఉపయోగిస్తున్నారో, ఎంత శాతం ఉపయోగిస్తున్నారో గణాంకాలను చూద్దాం.2001 లో19%  మంది పాటశాల విద్యార్ధులు,23% మంది యువతీయువకులు,26% మంది ఉద్యోగినులైన స్త్రీలు,13% మంది కళాశాల విద్యార్ధులు,9% మంది పెద్ద వయస్కులు 10% మంది గృహిణులు ఈ అంతర్జాలాన్ని ఉపయోగించేవారిలో ఉన్నారు.ఇవే గణాంకాలు 2009 కి వచ్చేసరికి ఈ విధంగా ఉన్నాయి 14% మంది  పాటశాల విద్యార్ధులు,౩౦% మంది యువతీయువకులు,28%మంది ఉద్యోగినులైన స్త్రీలు 13% మంది కళాశాల విద్యార్ధులు, 8% మంది పెద్ద వయస్కులు, 7% మంది గృహిణులు. అంటే యువతీయువకులు ఈ అంతర్జాలాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అన్నమాట.ఇప్పుడు ఎక్కువగా ఏ ఏ నగరాల నుండి ఈ అంతర్జాలం  యొక్క ఉపయోగం ఎక్కువగా ఉందో చూద్దాం.భారత దేశం లోని అంతర్జాల వినియోగదారులలో 37% మంది ముంబై,బెంగుళూరు,ఢిల్లీ,కలకత్తా,చెన్నై,పూణే,హైదరాబాద్,అహ్మదాబాద్,సూరత్,నాగపూర్ వంటి 10  నగరాలనుండే ఉన్నారు. వీరిలో కూడా యువతీయువకులే ఎక్కువగా ఉండటం విశేషం.51% మంది అంతర్జాల వినియోగదారులు కేవలం డేటింగ్/ఫ్రెండ్ షిప్  వెబ్సైటులను మాత్రమె చూస్తారు దీనిలో ఎక్కువగా 19-35 సంవత్సరాల మధ్యవయస్కులే ఉండటం గమనించదగ్గ విషయం . అంటే యువత అవసరానికి మించి ఈ అంతర్జాలపు మాయాజాలం లో చిక్కుకొంటోంది.ముఖ్యంగా FACEBOOK ,ORKUT ,IBIBO,YAHOO వంటి సోషల్ నెట్వర్కింగ్  సైట్స్ వల్ల స్నేహాన్ని పెంచుకొనే వీలున్నా సమయాన్ని ఎక్కువగా వృధా చేసుకుంటున్నారు.దీనిలో తమ వ్యక్తిగత వివరాలను వెల్లడించడం ద్వారా చాల ఇబ్బందులకు గురి అవుతున్నారు.మరి కొంత మంది అయితే ఏకంగా తమ జీవిత భాగాస్వాములును ఎన్నుకోవడానికి వీటిని సాధనాలుగా వాడుతున్నారు.అంతే కాకుండా యువతీయువకులు అసభ్యమైన వెబ్సైటులను చూడటానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.ప్రతి 100  మంది లో 65 మంది విద్యా సంబంధిత విషయాలను కోసమై అంతర్జాలాన్ని ఉపయోగిస్తూ ఉండగా 87 మంది మాత్రం వ్యర్ధం అయిన విషయాలతో కూడిన చాటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు.ఏటా 
10% మంది అంతర్జాల వినియోగదారులు మానసిక రోగాలకు గురి అవుతున్నారు.పెరుగుట విరుగుట కొరకే అని నానుడి అలాగే మన సౌఖ్యం కోసం ఉపయోగపడాల్సిన అంతర్జాలం మన జీవితాలను నాశనం చేసే స్థాయికి ఎదిగింది. దీనివల్ల కాపురాలలో కలహాలు ఏర్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా ఇక్కడ యువత ఒక విషయాన్ని అర్ధం చేసుకోవాలి అవసరం అయినంతవరకు ఉపయోగిస్తే ఈ అంతర్జాలం మన మిత్రుడితో సమానం అదే అనవసరంగా ఉపయోగిస్తే అదే మన జీవితాన్ని నాశనం చేసే శత్రువు అవుతుంది .కాబట్టి అంతర్జాలపు మాయాజాలం నుండి తప్పుకోవడానికి మేలుకో యువతా మేలుకో .