Gulf Andhra Radio

Total Pageviews

Popular Posts

Saturday, January 29, 2011

ప్రేమ నేరమా?




అవును నేను వేసిన ప్రశ్న సరి ఐనదే "ప్రేమ నేరమా?"
ఎందుకంటే ఇంతకు ముందు టపాలో నేను చెప్పినట్టుగా మన ప్రేమ ఇంకొకరి ప్రాణాలను తీసే విధంగానో లేక ఇతరుల మనసును నొప్పించేదిగానో ఉండకూడదు.
ఐనా ప్రేమ అనేది ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి కి సంబంధించిన అంశమేనా ఒక అమ్మాయి అబ్బాయి స్నేహంగా ఉండలేరా?
మనం ప్రేమించిన వాళ్ళు మనలను ప్రేమించక పోతే అది వాళ్ళు చేసిన నేరమా? వారు ప్రేమించనందుకు వారి ప్రాణాల్ని తియ్యాలా?
వారు మనలాగా ఒక తల్లి బిడ్డలే కదా?క్షణికావేశం లో చేసిన ఆ తప్పు వల్ల ఎన్ని జీవితాలు బాధపడతాయి? ఉదాహరణకు మన రాష్ట్రం లో ప్రేమ పేరుతొ జరిగిన కొన్ని దాడుల గురించి చూద్దాం. స్వప్నిక &ప్రణీత ఈ పేర్లు గుర్తున్నాయా? గుర్తుండే ఉంటుంది. వీరిపై వరంగల్ లో ప్రేమోన్మాదులు యాసిడ్ తో దాడి చేసారు ఈ దాడిలో స్వప్నిక ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోగా ప్రణీత మాత్రం మృత్యువుని జయించింది. మరి ఈ దాడి చేసిన వారి పరిస్థితి ఏంటి అంటే ఎన్కౌంటర్ లో వారు కూడా మరణించారు. ఇక రాజమండ్రి లో అనుష ప్రేమంచలేదన్న అక్కసుతో గొంతుకోసాడొక ప్రేమోన్మాది. ఈ దాడిలో అనుష తల్లి దండ్రులు మరణించగా అనుష తీవ్ర గాయాలతో బయటపడింది. ఇకపోతే విజయవాడ లో జరిగిన శ్రీ లక్ష్మి హత్య కూడా ఇలాంటిదే ప్రేమించలేదని కళాశాలకు వెళ్లి మరీ చంపి వచ్చాడు ఆ ప్రబుద్ధుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీరంతా చేసిన నేరం ఏమిటి ప్రేమించకపోవడమా? ఇలా దాడులు చేసిన వారంతా ఎందుకు చేసారు ? ప్రేమించడం వల్లనా?రెండిటికి సమాధానం "అవును". ప్రేమించడం తప్పుకాదు కానీ ఆ ప్రేమను వ్యక్తీకరించిన తరువాత ఎదుటి వ్యక్తి భావాలను గౌరవించాలి. మనం ప్రేమించినంత మాత్రాన అవతలి వారు మనల్ని ప్రేమించాలి అన్న నిబంధన ఏమి లేదు కదా? మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? మనుషులం అనే విషయాన్ని మరచి మృగాల్ల ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మన ఇంటిలోని వారిని ఎవరన్నా ఎమన్నా అంటే రోషం పొడుచుకు వస్తుంది మనకి మరి ఎదుటి వారు కూడా అలంటి వారే అనే భావన అప్పుడు ఎందుకు కలగదు? ఆలోచించండి మృగాలలాగా కాకుండా మనుషుల్లా ప్రవర్తిద్దాం పాటశాలలో చేసిన "భారత దేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు" అనే ప్రతిజ్ఞను జ్ఞాపకం తెచ్చుకుందాం అప్పుడు మనలో సోదర భావం కలిగి కనీసం కొంచెమన్నా వివేకం కలిగి ప్రవర్తిస్తామేమో? ఇవన్నీ చేసేది యువతే మంచి చెయ్యాలన్నా చెడు చెయ్యాలన్నా యువత మీదే ఆధారి పడి ఉంటుంది.
మరి మన వంతు భాద్యతగా ఇలాంటివి జరగకుండా చూడాలి కదా? కాబట్టి మేలుకో యువతా మేలుకో

Friday, January 28, 2011

నేటి యువత

నేటి యువత పయనం ఎటు వైపు?
సినిమాల వైపా? మాదక ద్రవ్యాలవైపా? ప్రేమ వైపా?
లేక సమాజ సేవ వైపా? ఆలోచిస్తే, ప్రతి ఒక్కరు తమ జీవితాలను పరిశీలిస్తే సమాధానం తెలిసిపోతుంది.
సినిమాలు చూడటం తప్పుకాదు ఆ సినిమాలోని మంచిని తీసుకొని చెడును విసర్జించగలగాలి .
మాదక ద్రవ్యాలు అవసరమా అనే ప్రశ్న నేటి యువత వేసుకోవాలి. ఏదో సరదాగా కాలక్షేపానికో, స్నేహితుల ప్రోద్భలంతోనో అలవాటైన ఈ మాదక ద్రవ్యాలు వ్యసనంగా మారి ప్రాణాలనే హరించే పరిస్థితి ఎదురవుతుంది. మరి అలాంటివి అవసరమా?
ఇక ప్రేమ, ప్రేమించడం తప్పు కాదు మన ప్రేమ ఇంకొకరి ప్రాణాలను తీసే విధంగానో లేక ఇతరుల మనసును నొప్పించేదిగానో ఉండకూడదు.
మనం ప్రేమించినంత మాత్రాన ఎదుటి వారు మనల్ని ప్రేమించాలని ఏమి లేదు కదా. మరి ఈ విషయాన్నీ ఆలోచించకుండా మనం చావడమో లేక ఎదుటి వారిని చంపడమో ఎంతవరకు సమంజసం? ప్రేమించిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవడం తర్వాత తిరిగి తల్లిదండ్రులపై కేసులు పెట్టడం ఎంతవరకు సరి ఐనది?అల చేస్తే కని, పెంచి, విద్యాబుద్ధులు నేర్పించి, మనకంటూ సమాజంలో ఒక గుర్తింపునిచ్చిన వారి హృదయాలు ఎంత క్షోభిస్తాయి? ముదిమి వయసులో మన చేయూతనందుకొని శేష జీవితాన్ని ఆనందంగా గడపాలనుకొనే వారి కల నెరవేరుతుందా? ఆలోచించండి
ఇక సమాజ సేవ విషయానికి వద్దాం. సమాజసేవ అంటే ఏదో దేశాన్ని ఉద్ధరించేయడం కాదు మన వంతుగా ఎదుటి వారి హక్కులను కాలరాయకుండా ఉండటం. మనహక్కులు ఎదుటి వారికి భాద్యతలు అలాగే ఎదుటి వారి హక్కులు మనకు భాద్యతలు.
మనం ఏ విధంగా మన హక్కులను అనుభవించాలి అని అనుకుంటున్నామో ఎదుటి వారు కూడా అలానే ఆలోచిస్తారు.
మరి ఇది సమాజ సేవ కాదంటారా?
ఆలోచించండి, యువత తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే సమ సమాజాన్నిస్థాపించవచ్చు కాబట్టి మేలుకో యువతా మేలుకో.