Gulf Andhra Radio

Total Pageviews

Popular Posts

Saturday, January 29, 2011

ప్రేమ నేరమా?




అవును నేను వేసిన ప్రశ్న సరి ఐనదే "ప్రేమ నేరమా?"
ఎందుకంటే ఇంతకు ముందు టపాలో నేను చెప్పినట్టుగా మన ప్రేమ ఇంకొకరి ప్రాణాలను తీసే విధంగానో లేక ఇతరుల మనసును నొప్పించేదిగానో ఉండకూడదు.
ఐనా ప్రేమ అనేది ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి కి సంబంధించిన అంశమేనా ఒక అమ్మాయి అబ్బాయి స్నేహంగా ఉండలేరా?
మనం ప్రేమించిన వాళ్ళు మనలను ప్రేమించక పోతే అది వాళ్ళు చేసిన నేరమా? వారు ప్రేమించనందుకు వారి ప్రాణాల్ని తియ్యాలా?
వారు మనలాగా ఒక తల్లి బిడ్డలే కదా?క్షణికావేశం లో చేసిన ఆ తప్పు వల్ల ఎన్ని జీవితాలు బాధపడతాయి? ఉదాహరణకు మన రాష్ట్రం లో ప్రేమ పేరుతొ జరిగిన కొన్ని దాడుల గురించి చూద్దాం. స్వప్నిక &ప్రణీత ఈ పేర్లు గుర్తున్నాయా? గుర్తుండే ఉంటుంది. వీరిపై వరంగల్ లో ప్రేమోన్మాదులు యాసిడ్ తో దాడి చేసారు ఈ దాడిలో స్వప్నిక ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోగా ప్రణీత మాత్రం మృత్యువుని జయించింది. మరి ఈ దాడి చేసిన వారి పరిస్థితి ఏంటి అంటే ఎన్కౌంటర్ లో వారు కూడా మరణించారు. ఇక రాజమండ్రి లో అనుష ప్రేమంచలేదన్న అక్కసుతో గొంతుకోసాడొక ప్రేమోన్మాది. ఈ దాడిలో అనుష తల్లి దండ్రులు మరణించగా అనుష తీవ్ర గాయాలతో బయటపడింది. ఇకపోతే విజయవాడ లో జరిగిన శ్రీ లక్ష్మి హత్య కూడా ఇలాంటిదే ప్రేమించలేదని కళాశాలకు వెళ్లి మరీ చంపి వచ్చాడు ఆ ప్రబుద్ధుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీరంతా చేసిన నేరం ఏమిటి ప్రేమించకపోవడమా? ఇలా దాడులు చేసిన వారంతా ఎందుకు చేసారు ? ప్రేమించడం వల్లనా?రెండిటికి సమాధానం "అవును". ప్రేమించడం తప్పుకాదు కానీ ఆ ప్రేమను వ్యక్తీకరించిన తరువాత ఎదుటి వ్యక్తి భావాలను గౌరవించాలి. మనం ప్రేమించినంత మాత్రాన అవతలి వారు మనల్ని ప్రేమించాలి అన్న నిబంధన ఏమి లేదు కదా? మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? మనుషులం అనే విషయాన్ని మరచి మృగాల్ల ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మన ఇంటిలోని వారిని ఎవరన్నా ఎమన్నా అంటే రోషం పొడుచుకు వస్తుంది మనకి మరి ఎదుటి వారు కూడా అలంటి వారే అనే భావన అప్పుడు ఎందుకు కలగదు? ఆలోచించండి మృగాలలాగా కాకుండా మనుషుల్లా ప్రవర్తిద్దాం పాటశాలలో చేసిన "భారత దేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు" అనే ప్రతిజ్ఞను జ్ఞాపకం తెచ్చుకుందాం అప్పుడు మనలో సోదర భావం కలిగి కనీసం కొంచెమన్నా వివేకం కలిగి ప్రవర్తిస్తామేమో? ఇవన్నీ చేసేది యువతే మంచి చెయ్యాలన్నా చెడు చెయ్యాలన్నా యువత మీదే ఆధారి పడి ఉంటుంది.
మరి మన వంతు భాద్యతగా ఇలాంటివి జరగకుండా చూడాలి కదా? కాబట్టి మేలుకో యువతా మేలుకో

5 comments:

sashi said...

super suresh

vedavyas said...

prema narem kaadu kaani premikulu murkula avvajudadu

vedavyas said...

prema narem kaadu kaani premikulu murkula avutunnaru

Radha said...

ప్రేమ ఎప్పుడూ నేరంకాదు. సృష్టికి మూలం ఫ్రేమే.
ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును అన్నాడో కవి. ప్రేమతోనే ప్రేమను పొందాలి కానీ దౌర్జన్యంతో కాదు. ఈ విషయాన్ని చక్కగా వివరించారు. యువకులందరూ మీలా ఆలోచిస్తే ఈ సమస్య ఉండదు కదా.
నేటి పరిస్థితి చూస్తే ప్రేమ నేరం కాదేమో, ప్రేమించకపోవడమే నేరం అవుతున్నట్టుంది.
కీపిటప్.

Uday said...

ధన్యవాదాలు అండి రాధా గారు మీ అందరి ఆశీస్సులతో తప్పకుండ ఇటువంటివాటిని ఇంకా ప్రచురిస్తాను.